క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌తీ ఒక్క‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్య‌తాయుతంగా వ్యాక్సిన్ వేయించుకుని క‌రోనా నివార‌ణ‌కు పాటుప‌డాల‌ని మాజీ ఎమ్మ‌ల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న గ‌చ్చిబౌలిలోని హిమ‌గిరి ఆసుప‌త్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా భిక్ష‌ప‌తియాద‌వ్ మాట్లాడుతూ కోవిడ్ మ‌హ‌మ్మారిని తరిమి కొట్టాలంటే ప్ర‌తీ పౌరుడు విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ వ‌ల్ల ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌ని, తాను వ్యాక్సినేష‌న్ అనంత‌రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here