నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి నృత్య శిక్షకురాలు డాక్టర్ రమాదేవి చేసిన కేళికలాపం, భామాకలాపం, దాదినమ్మ కలాపాలను కూచిపూడి నృత్య శైలి లో ప్రదర్శించి అలరించారు. కూచిపూడి నృత్య శైలిలో ఎంత ప్రాముఖ్యత కలిగి అంతరిచిపోతున్న కలాపాలను డాక్టర్ రమాదేవి శని, ఆదివారాల్లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సిద్ధేంద్ర యోగి విరచితమై ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ” భామాకలాపం ప్రదర్శనలో సత్యభామ పాత్రలో నర్తించి మెప్పించారు. ఈ ప్రదర్శనలో సత్యభామగా రమాదేవి, కృష్ణుడిగా రాజరాజేశ్వరీ, మాధవిగ పసుమర్తి శేషుబాబులు పాత్రదారులుగా నిలిచారు.






