నిస్వార్ధ‌, నిరాడంబ‌ర నేత రామ్‌చంద‌ర్‌రావును తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నుకుందాం: ర‌వీంద్ర‌ప్ర‌సాద్ దూబే

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉమ్మ‌డి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హబూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ బిజెపి అభ్య‌ర్థి ఎన్‌.రామ్‌చంద‌ర్ రావుకు మ‌ద్ధ‌తుగా ఆ పార్టీ రాష్ట్ర నాయ‌కులు ర‌వీంద్ర ప్ర‌సాద్ దూబే గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని న‌ల్ల‌గండ్ల, ల‌క్ష్మీవిహార్‌, అప‌ర్ణ స‌రోవ‌ర్‌, హుడా కాల‌నీల‌లో సోమ‌‌వారం ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తనకు తాను ప్రజాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గత ఆరు సంవత్సరాలు విస్తృతంగా పర్యటించి ప్రజాలమనిషిగా పేరుతెచ్చుకున్న రామచందర్ రావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన‌ ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని అన్నారు. విజ్ఞులు ఓటు వేఏ ముందు ఆలోచించాల‌ని, రామ్‌చంద‌ర్ రావు లాంటి నిస్వార్ధ‌, నిరాడంబ‌రుడైన నాయ‌కులు మ‌న‌కెంతో అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వసంత్ కుమార్ యాద‌వ్‌, నరేందర్ గౌడ్, బీజేవైఎం నాయకులు సామ్రాట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప‌ట్ట‌భ‌ద్రుల‌కు క‌ర‌ప‌త్రాలు అంద‌జేసి ఓటు అభ్య‌ర్ధిస్తున్న ర‌వీంద్ర‌ప్ర‌సాద్ దూబే, వసంత్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here