మక్తల్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతాపార్టీ మక్తల్ అసెంబ్లి ఆద్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో సోమవారం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జీ నందకుమార్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రేణులకు పలు సూచనలు చేశారు. ప్రతి 25 మంది పట్టభధ్రులకు ఒక ప్రభారీ భాద్యత తీసుకోవాలని, ప్రచారం పర్వం ముగిసే లోపు ప్రతి ఓటరును కనీసం ఐదు సార్లైన కలసి మొదటి ప్రాధాన్యత ఓటు బిజెపి అభ్యర్థికి వేసే విధంగా వారిని సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. గతం కంటె రెట్టింపు మెజారిటీతో రామచందర్రావును గెలిపించాలని శ్రేణులకు పిలుపునచ్చారు. మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తీసుకురావాల్సిన భాద్యత పచ్చీస్ ప్రభారీలపై ఉందని అన్నారు. బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యులు బి.కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు నాగురావు నామాజీ, శ్రీవర్ధన్ రెడ్డి, రతంగ్ పాండరెడ్డి, పావని, అనుష తదితరులు పాల్గొన్నారు.






