నమస్తే శేరిలింగంపల్లి: సగరులకు ఆద్యుడు భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాష్ర్ట సగర సంగం నాయకులు ఆదివారం సంస్థాన్ నారాయణ పురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సగర సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సాగర్, ప్రధానకార్యదర్శి సత్యం సాగర్, కర్నె ప్రభాకర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్క సురేష్ సాగర్ , కోశాధికారి సందుపట్ల రాము సాగర్ , రాష్ట్ర ప్రచార కార్యదర్శి నేర్లకంటి రవి కుమార్ సాగర్, యాదాద్రి జిల్లా సంఘం అధ్యక్షులు నరసింహ సాగర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సాగర్ తో పాటు సగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.






