అయోధ్య రామ మందిరానికి రాచ‌మ‌ళ్ల ఓంప్ర‌కాష్ గౌడ్ రూ.50 వేల నిధి స‌మ‌ర్ప‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అయ్యోధ్య శ్రీ భవ్య రామమందిర నిర్మాణ జనజాగరణలో భాగంగా బుధ‌వారం బిజేపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకిందిగోవర్ధన్ గౌడ్‌ ఆద్వ‌ర్యంలో రామ‌సేవ‌కులు ప్ర‌ముఖ‌ ఎక్సైజ్ కాంట్రాక్టర్, మియాపూర్ వాస్త‌వ్యులు‌ రాచ‌మ‌ళ్ల ఓం ప్ర‌కాష్‌గౌడ్‌ను క‌లిశారు. ఈ సందర్భంగా మందిర నిర్మాణ ప్రాధాన్య‌త‌, ప్రణాళిక‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. స్పందించిన ఓం ప్ర‌కాష్‌గౌడ్ రామ‌మందిర నిర్మాణ నిధి స‌మ‌ర్ప‌ణ‌లో తనవంతుగా రూ.50 వేల చెక్కును అందజేశారు.

గోవ‌ర్ధ‌న్‌గౌడ్ కు నిధి స‌మ‌ర్ప‌ణ చెక్కును అంద‌జేస్తున్న ఓం ప్ర‌కాష్‌గౌడ్‌

కోస‌ల రాజ్య రాజ‌దాని, స‌ర‌యూ న‌ది ఒడ్డున, అయోధ్య‌ న‌గ‌రంలోని శ్రీ రామ‌జ‌న్మ‌భూమిలో చేప‌ట్ట‌నున్న భ‌వ్య‌మందిర నిర్మాణంలో త‌న‌వంతు స‌మ‌ర్ప‌ణకు అవ‌కాశం ల‌భించ‌డం అదృష్టంగా బావిస్తున్న‌ట్టు ఓం ప్ర‌కాష్‌గౌడ్‌ పేర్కొన్నారు. రామకార్యంలో భాగస్వామ్యులయిన ఓంప్ర‌కాష్‌గౌడ్ కు గోవ‌ర్ధ‌న్ గౌడ్ బృందం ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ సేవ‌కులు పుట్ట విన‌య‌కుమార్ గౌడ్‌, మాజీ కార్పొరేట‌ర్ అశోక్‌గౌడ్‌, యాద‌గిరిగౌడ్‌, క‌రుణాక‌ర్ గౌడ్, సాయి కుమార్, వీర్ కుమార్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here