శ్మ‌శాన‌వాటిక‌ల అభివృద్ధికి కృషి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హఫీజ్ పేట్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని శ్మ‌శాన‌వాటిక‌ల‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శ‌నివారం ఆయ‌న హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామ బిసి శ్మ‌శానవాటికను కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామ‌న్నారు. అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తున్నామ‌ని, శ్మ‌శాన‌వాటికల్లో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యుడు కనకమామిడి వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యుడు సుదర్శన్, నాయకులు ఆనంద్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, ఆర్.మల్లేష్ గౌడ్, ప్రవీణ్, చారి, ప్రభు గౌడ్, లక్ష్మయ్య గౌడ్, యాదగిరి గౌడ్, వీరేశం గౌడ్, రమేష్, రాకేష్, శేఖర్, శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, గణేష్, సురేష్, రాజు, మల్లేష్, శంకర్, స్వామి, మైనారిటీ నాయకులు సయ్యద్ తయ్యార్ హుస్సేన్, సంజు సాగర్, సుదేశ్, సాబేర్, జామీర్, బాబు, కార్తిక్, సాయి పాల్గొన్నారు.

ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలోని బిసి శ్మ‌శానవాటికను ప‌రిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here