మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆదిత్య నగర్, నవభారత్ నగర్, రాజారామ్ కాలనీలలో శ్మశానవాటిక, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యుడు రహీం, ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తి కమిటీ సభ్యుడు ఖాసీం పాల్గొన్నారు.






