మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ విలేజ్ వాసులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్‌కు విన్నవించారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని కార్పొరేటర్ ఈ సందర్భంగా విలేజ్ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విలేజ్ వాసులు పాల్గొన్నారు.






