హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ లో బస్తీ కమిటీ ఆధ్వర్యంలో విన్ విజన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ కంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసే ఇలాంటి శిబిరాలను వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి వైద్యం అందించారని గుర్తు చేశారు. విన్ విజన్ ఐ హాస్పిటల్స్ ముందుకు వచ్చి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్ సిబ్బందిని, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంజు సాగర్, కమోజీ, ముజీబ్, ఏరియా సభ్యులు సుదేశ్, సాబేర్, ఉషప్ప, పాషా, విశ్వనాథ్, యూసుఫ్, డాక్టర్ రాహుల్, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నరేష్, పాండు పాల్గొన్నారు.






