హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధే ద్యేయంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆమె డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట గ్రామంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. యూజీడీ, మంజీరా పైప్‌లైన్, ఎలక్ట్రిక్ స్తంభాల తొలగింపు, సీసీ రోడ్డు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యుడు కనకమామిడి వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యుడు సయ్యద్ సత్తార్ హుస్సేన్, నాయకులు ఆనంద్ గౌడ్, నరేందర్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీశైలం కుమ్మరి, రామకృష్ణ గౌడ్, సాయి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, వెంకటేష్ ముదిరాజ్, బాబు గౌడ్, రాధాకృష్ణ, సయ్యద్ సాదిక్ హుస్సేన్, కృష్ణ ముదిరాజ్, స్వామి, యూత్ సభ్యులు నరేష్, పాండు, దిలీప్, సూర్యం, శ్రీకాంత్, రషీద్, శంకర్, విక్కు ముదిరాజ్, రాజ్ కుమార్, నదీమ్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.





