యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలించిన భేరి రామచందర్ యాదవ్

గచ్చిబౌలి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ కాలనీలో కొన‌సాగుతున్న‌ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ప‌రిశీలించారు. కాలనీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామ‌ని అన్నారు. కాలనీలో ప‌లు వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు. ఈ విషయాన్ని ప్ర‌భుత్వ విప్ ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయిబాబా దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఉప కమిషనర్ వెంకన్న స్పందించి ప‌నులు చేపట్టేలా ఆదేశాలిచ్చార‌న్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు ఎండీ కమర్ పాషా, రాయుడు, కార్యదర్శి టి.కుమార్ ముదిరాజ్, రజక సంఘం అధ్యక్షుడు నరేందర్, రమేష్ గుప్తా, పరశురాం, మానేయ సాగర్ సింగ్, కృష్ణమూర్తి, అడివయ్య, రాంబాబు నాయక్, గణేష్, ధన శేఖర్ నాయక్, గణేష్ నాయక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here