మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని హరిజన బస్తీలో ఆయన పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీ వాసుల కోసం తాగునీటి పైప్ లైన్లు, యూజీడీ లైన్లను కొత్తగా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సహదేవ్, అర్జున్, ప్రభు, రాజు, బుచ్చి, యూత్ సభ్యులు రాజేష్, మహీందర్, సుబ్బు, సురేష్, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ చారి,హెచ్ఎండబ్లుఎస్ఎస్బి మేనేజర్ నివర్తి పాల్గొన్నారు.






