కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నమస్తే హైదరాబాద్ రెస్టారెంట్ ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పురుషోత్తం సగర, జంగం గౌడ్, సురేందర్, నవాజ్, దీపక్ పాల్గొన్నారు.







