శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్- 2 లో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అలాగే రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు సురేందర్, నవాజ్, సెంట్రల్ పార్క్ ఫేజ్-2 అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణి శ్రీరామనేని, సురేష్, రామకృష్ణ, హరినారాయణ, వెంకటేశ్వర రావు, శ్రీకర్, ప్రవీణ్, సాయి, వేణు, రాధా కృష్ణ, జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.






