గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రం బీసీ సంఘం ఉపాధ్యక్షుడిగా భేరి రామచందర్ యాదవ్, సంగారెడ్డి జిల్లా యువజన విభాగం బీసీ సంఘం అధ్యక్షుడిగా పి గణేష్ యాదవ్ లు నియమితులైన సందర్భంగా వారిని ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు తెనుగు నరసింహ పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె కృష్ణమూర్తి చారిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలు, వెనుకబడిన కులాల విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా బతకాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, షబ్బీర్, రవికిరణ్, రమేష్, సుధాకర్, బీసీ నాయకులు పాల్గొన్నారు.






