తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయ‌కుల‌ నిరసన

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ‌రాముడితోపాటు అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామ మందిర నిర్మాణానికి చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెరాస ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ మియాపూర్ డివిజ‌న్ బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌వారం నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్య‌క్షుడు డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్ మాట్లాడుతూ అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి నిధుల‌ను సేక‌రిస్తుంటే ఆ విష‌యాన్ని రాజ‌కీయాలు చేసేందుకే ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీన్ని బీజేపీ పూర్తిగా ఖండిస్తుంద‌న్నారు. ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, మనోహర్, కల్యాణ్, డివిజన్ అధ్య‌క్షులు మాణిక్ రావు, ప్రశాంతి, మహేష్, లక్ష్మణ్, కుమారస్వామి, రామకృష్ణారెడ్డి, ప్రసాద్, శ్రీశైలం, గణేష్, అశోక్, చందు, రత్న కుమార్, సిద్దు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మియాపూర్‌లో నిర‌స‌న తెలుపుతున్న డీఎస్ఆర్‌కే ప్ర‌సాద్, బీజేపీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here