శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): విశ్వకర్మ ఫౌండేషన్ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తేదీ ఆదివారం జరగనున్న విశ్వకర్మ ఆత్మీయ సభ, వివాహ పరిచయ వేదికకు సంబంధించిన గోడ పత్రికను రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పద్మ చారి, విశ్వ కర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్లూరి రవీంద్ర చారిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ విశ్వకర్మ ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడు వంగల శంకరాచారి, ఉపాధ్యక్షుడు కమ్మరి రామాచారి, సంయుక్త కార్యదర్శి కల్లూరి వెంకటాచారి, కోశాధికారి అవుసలి మల్లేశం చారి, ఉప సంయుక్త కార్యదర్శి పగడోజు శ్రీధర్ చారి పాల్గొన్నారు.






