ఫిట్‌గా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం: పుల్లెల గోపీచంద్‌, పాయ‌ల్ రాజ్‌పూత్

  • ముగిసిన సైబ‌రాబాద్ యాన్యువ‌ల్ స్పోర్ట్స్ మీట్ 2021
  • విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేసిన పుల్లెల గోపీచంద్‌, పాయ‌ల్ రాజ్‌పూత్
  • ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడ‌లు దోహ‌దం చేస్తాయి: సీపీ స‌జ్జ‌నార్

సైబ‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిత్య జీవితంలో ఆరోగ్యానికి కూడా అధిక ప్రాధాన్య‌త‌ను ఇవ్వాలని, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేయాల‌ని, దీంతో అనారోగ్యాలు రాకుండా ఉంటాయ‌ని ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్‌, న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్‌లు అన్నారు. గ‌త కొద్ది రోజులుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లో కొన‌సాగిన సైబ‌రాబాద్ యాన్యువ‌ల్ స్పోర్ట్స్ మీట్ 2021 సోమ‌వారంతో ముగిసింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి గోపీచంద్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌లు ముఖ్య అతిథులుగా హాజ‌రై క్రీడ‌ల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న పుల్లెల గోపీచంద్‌, సీపీ స‌జ్జ‌నార్

బాస్కెట్ బాల్‌, వాలీబాల్‌, క్రికెట్‌, 200, 400, 800, 1500 మీట‌ర్ల ప‌రుగు పందాలు, హై జంప్‌, లాంగ్ జంప్‌, షాట్ పుట్‌, డిస్క‌స్ త్రో, జావెలిన్ త్రో వంటి అంశాల్లో పోటీల‌ను నిర్వ‌హించ‌గా గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గోపీచంద్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌లు మాట్లాడుతూ ప్ర‌తి వ్య‌క్తికి ఫిట్‌నెస్ ముఖ్య‌మ‌ని అన్నారు. ఫిట్‌గా ఉంటేనే అనారోగ్య స‌మస్య‌లు రాకుండా ఉంటాయ‌న్నారు.

క్రీడాకారిణిల‌ను ప‌రిచ‌యం చేసుకుంటున్న పాయ‌ల్ రాజ్‌పూత్‌, చిత్రంలో సీపీ స‌జ్జ‌నార్

సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం వ్యాయామం చేయ‌డం, క్రీడ‌ల్లో పాల్గొన‌డం ద్వారా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాదాపూర్ డీసీపీ ఎం.వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్‌వోటీ ఏడీసీపీ సందీప్‌, సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, సీఎస్‌డ‌బ్ల్యూ ఏడీసీపీ వెంక‌ట్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీస‌ర్‌, ఏసీపీ సంతోష్ కుమార్‌, హెడ్ క్వార్ట‌ర్స్ ఏసీపీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ఆర్ఐలు, ఇన్‌స్పెక్ట‌ర్లు, ఇత‌ర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడ‌లు నిర్వ‌హిస్తున్న దృశ్యం

స్పోర్ట్స్ మీట్ విజేత‌లు వీరే…
1. వాలీ బాల్
విన్న‌ర్ – సీఏఆర్ హెడ్ క్వార్టర్స్
ర‌న్న‌ర్స్ అప్ – శంషాబాద్ జోన్

2. బాస్కెట్ బాల్
విన్న‌ర్ – ట్రాఫిక్ వింగ్
ర‌న్న‌ర్స్ అప్ – మాదాపూర్ జోన్

3. క్రికెట్
విన్న‌ర్ – సీఏఆర్ హెడ్ క్వార్టర్స్
ర‌న్న‌ర్స్ అప్ – ట్రాఫిక్ వింగ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here