- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడ గ్రేటెడ్ కమ్యూనిటీలు, పరిసర ప్రాంతాల్లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన “శ్రీరామ జన్మ భూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ “లో భాగంగా శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ జిల్లా సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు సంఘ్ పరివార్ నాయకులు కృష్ణా రెడ్డి, కోటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, తిరుపతి రెడ్డిలు కలసి ఇంటింటికీ జన జాగరణ కార్యక్రమం నిర్వహించి నిధి సేకరించారు.
ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్నిరోజుల నుండి ప్రారంభమైన శ్రీ రామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో ప్రజలందరూ సానుకూలంగా స్పందించి నిధులు సమర్పిస్తున్నారని అన్నారు. అలాగే రామ మందిర నిర్మాణంలో మనమందరం పాలు పంచుకుని మన శక్తి కొద్దీ నిధిని సమర్పిద్దామని అన్నారు. అలాగే మనతోపాటు తోటి హిందూ బంధువులను కూడా ఈ రామ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేద్దామని పిలుపునిచ్చారు.