మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామం యాంఫీ థియేటర్ లో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఇందులో భాగంగా ఉత్తుకాడు సప్త రాగ రత్నాలు పాటలకి ఆశ్రిత షిండే, యశస్వినీలు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. ఆనాడే నర్తన గణపతిమ్, స్వాగతం కృష్ణ, బాల సరస మురళి, మణినూపుర ధరి, మరకత మణిమయ చేలా, కళింగ నర్తన తిల్లాన, బృందావన నిలయేహ్ అంశాలను ప్రదర్శించి మెప్పించారు.