ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి షాకింగ్ న్యూస్ తెలిపింది. తన వాట్సాప్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించింది. నా వాట్సాప్ హ్యాక్ అయింది, నిన్నటి నుంచి యాక్సెస్ కావడం లేదు, మంచిదే, కొత్తగా మళ్లీ అకౌంట్ ప్రారంభిస్తా.. అని ఆమె ట్వీట్ చేసింది.
కాగా మంచు లక్ష్మి, ఆమె కుటంబ సభ్యులు ప్రస్తుతం తిరుపతిలో సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె వాట్సాప్ అకౌంట్ హ్యాక్‌కు గురి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంత సెక్యూరిటీ ఉంటందని చెప్పుకునే వాట్సాప్ దీనికి ఏమని బదులిస్తుందో చూడాలి. ఇక దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని సమాచారం.
My WhatsApp has been hacked! Can’t access since yesterday. Good riddance. Start fresh
— Lakshmi Manchu (@LakshmiManchu) January 14, 2021
ఇటీవలే ప్రముఖ యాంకర్ లాస్యకు చెందిన యూట్యూబ్ చానల్ హ్యాక్‌కు గురవ్వగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కష్టపడి ఆమె చానల్‌ను ఆధీనంలోకి తెచ్చారు. ప్రస్తుతం మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ అవ్వడం షాక్‌కు గురి చేస్తోంది. కాగా ఆమె ఈ ట్వీట్ పెట్టిన నిమిషాల్లోనే కొందరు నెటిజన్లు స్పందించారు. వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు మారిపోవాలని సూచిస్తున్నారు.