నమస్తే శేరిలింగంపల్లి: గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకం పై ఆర్ శరత్ కుమార్ నూతన దర్శకత్వంలో జి పాండురంగారావు, పులి అమృత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఖేల్ చిత్రం ఆడియో విడుదల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మదీనాగూడలోని తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన వేడుకలో దర్శక నిర్మాత,రచయిత పులి అమృత్ చేతుల మీదుగా ఖేల్ సినిమా పాటలు విడుదల చేశారు.
శరత్ కుమార్ దర్శకునిగా పరిచయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోలుగా రాఘవసాయి, నాగబాబు, చాణక్య, హీరోయిన్లుగా స్నేహాల్ కామత్, మమతా, దీక్ష నటిస్తున్నారు. వెంకట్ బోనాల, రమేష్ పంజాల, మోహన్ గౌడ్, మర్రి సాయికిరణ్ రెడ్డి, మెరిగె కార్తికేయ రెడ్డి తదితరులు నటినటులతో చిత్ర నిర్మాణం సాగుతున్నట్లు అమృత్ గౌడ్ వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం ఆనంద్ అవసరాల, పాటలు వంశీకృష్ణ, నాగిరెడ్డి లింగారెడ్డి, గానం సాకేత్ సాయిరామ్, పులి అమృత్, ఆనంద్ అవసరాల, అశ్విన్ అయ్యర్, సౌమ్య ఆలూర్, కెమెరా అమర్నాథ్ సాధనాల, నిర్మాతలుగా జి.పాండురంగారావు, పులి అమృత్, రచన, దర్శకత్వం శరత్ కుమార్ వహిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ ఖేల్ సినిమాను అక్టోబర్ చివరి వారం లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.