మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్ ఇచ్చిన పిలుపుమేరకు జగదీశ్వర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రమణా రెడ్డి, నరేందర్ రెడ్డి, సురేందర్ రావు, సుందర్ నాయుడు, రఘురామ్, రమేష్, శ్రీకాంత్, రమణ కుమార్, కృష్ణ మోహన రెడ్డి, ప్రసాద్, రాము, సుధీర్ పాల్గొన్నారు.






