కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ శరత్ మాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అశ్వధ హోటల్ ను కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ యజమానులు మన్సూర్, నీలం రాము ముదిరాజ్, నీలం లక్ష్మి నారాయణ ముదిరాజ్, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, కేశం కుమార్ ముదిరాజ్, స్వామి సాగర్, మహ్మద్ ఖాసిమ్, షేక్ జహంగీర్, వెంకటేష్ ముదిరాజ్, యాదగిరి సాగర్, ఉదయ్ కిరణ్, విజయ్, రవి, ఇర్ఫాన్, సైదులు సాగర్, శ్రీధర్ పాల్గొన్నారు.






