మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ కు చెందిన తెరాస నాయకులు గుండె దయానంద్ ముదిరాజ్, కాసాని శ్రీధర్ ముదిరాజ్, నరేష్, చిన్నా, సుధాకర్ వర్మ, జె సంతోష్ వర్మలు కార్పొరేటర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






