యాదవుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పోరాడుదాం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • జాతీయ యాదవ హక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో యాదవ గర్జన

నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ యాదవ హక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద యాదవ గర్జన కార్యక్రమం నిర్వహించారు. యాదవ సంఘం జాతీయ నాయకులు , రాష్ట్ర నాయకులు , యువజన నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. యాదవ హక్కుల కోసం పోరాడుతున్న యాదవ సమితి సభ్యులను అభినందించారు, యాదవుల సంక్షేమం కోసమే మనం అండరం కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

50 సంవత్సరాల గొర్ల కాపరులకు 3000 ఫించన్ , ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రె కాపరులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా, గొర్లు మేకలకి ప్రమాద బీమా ప్రభుత్వం చేయించాలని, గొర్లు మేకల సబ్సిడీ లోన్లలో ప్రాముఖ్యత గొల్ల కురుమలకు ఇవ్వాలని, జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ లో గొల్ల కురుమలకు ప్రాథమిక ప్రాధాన్యత కల్పించడం, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు, తెలంగాణలో యాదవులు 18% ఉన్నారని, రాజకీయాలలో ఎమ్మెల్యే, ఎంపి నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్స్, ఎస్ ఎంటి రిజర్వేషన్ పునరుద్దరణకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

యాదవులను ఓట్ల కోసం వాడుకుంటున్నారని, గోర్లు, బర్లు ఇవ్వడం మాత్రమే కాదు, విద్యా పరంగా ఎదిగేలా చూడాలని కోరారు. యాదవులను ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ సంఘం అధ్యక్షులు మేకల రాములు, రాష్ట్ర యాదవ యువజన సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు రవి, సాయన్న యాదవ్, శ్రీహరి యాదవ్, రాధాకృష్ణ యాదవ్, బాలు యాదవ్, కుమార్ యాదవ్, పవన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here