- ఓటేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రోజాదేవి రంగారావు కుటుంబ సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా వివేకానంద నగర్ లోని సొసైటీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో కార్పొరేటర్ రోజాదేవి రంగరావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆయన సతీమణి శ్యామలదేవి, కొడుకు పృథ్వీ గాంధీ, కోడలు భార్గవి ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేనీ చంద్రకాంత్ రావు , కార్తిక్ రావు, రాంచందర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.