- రూ. 10లక్షల సొంత నిధులు వెచ్చింపు
- ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఆ కాలనీ సెక్యురిటి కమిటీ ఆధ్వర్యంలో రూ. 10 లక్షలతో ప్రధాన కూడలిలలో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడారు. సమాజ హితం, ప్రజల ఇబ్బందులను గట్టేంకించడానికి స్వంత నిధులతో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. కాలనీలో ఉదయం ,సాయంత్రం తీవ్రంగా రద్దీ నెలకొందని, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేయడం జరిగినదని, ప్రజలకు, విద్యార్థులకు,ఉద్యోగులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వారిని దృష్టి లో పెట్టుకొని సిగ్నల్స్ వ్యవస్థాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్మిషన్ రాగానే త్వరలోనే పూర్తి స్థాయిలోకి అందుబాటులో కి వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ కాలనీ సెక్యురిటి కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, దేవి నేనీ శివరాం ప్రసాద్, నారాయణ రెడ్డి, సత్యనారాయణ, వేణు బాబు, నాయి నేనీ చంద్రకాంత్ రావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , వి. రాంచందర్, దుర్గ ప్రసాద్, మేక శివరాం ప్రసాద్, శివ, కాలనీ వాసులు పాల్గొన్నారు