ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • మైత్రి నగర్ ఫేస్ -3 కాలనీలో (యూజీడీ ) నిర్మాణ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేస్ -3 కాలనీలో రూ. 65 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (యూజీడీ ) నిర్మాణ పనులకు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ , జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ.. సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం అన్నారు. యుజిడి వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజిఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి, హఫీజ్పెట్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, బక్కి వెంకటయ్య, అన్వర్ షరీఫ్, నిమ్మల రామకృష్ణ గౌడ్ , రఘునాథ్, బాబుమోహన్ మల్లేష్, జనార్దన్, వెంకటేశ్వరరావు, దామోదర్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, వీరేందర్, దయాకర్ రెడ్డి, రాజరాం, రమేష్, పూర్ణచందర్ రావు, పల్లం రాజు, సాయినాథ్, ఏసుదాస్ వెంకటేశ్వర్ రావు,నర్సింహ గౌడ్,బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మైత్రి నగర్ ఫేస్ -3 కాలనీలో (యూజీడీ ) నిర్మాణ పనులకు
కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here