రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు

  • వేడుకగా సంతాన నాగదేవత సాయిబాబా సమేత మార్కండేయ దేవాలయం 9వ వార్షికోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప కాలనీలోని సంతాన నాగదేవత సాయిబాబా సమేత మార్కండేయ దేవాలయం 9వ వార్షికోత్సవంలో ఆలయ నిర్మాత శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంతాన నాగదేవత సాయిబాబా సమేత మార్కండేయ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రతిరోజు సంతోషంగా గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నిర్మాణంలోని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దేవాలయం నిర్మాణం పూర్తయితే చాలా సుందరంగా ఉంటుందని అన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, బసవయ్య, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, మోహన్, లక్ష్మి, సరిత, రోజరాణి, సంగీత, ప్రతాప్ రెడ్డి, రాములు, రామరావు, లక్ష్మి, సౌజన్య, రాములమ్మ, సరిత నాగరాజు, సురేష్, వినయ్, అజీమ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంతాన నాగదేవత సాయిబాబా సమేత మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here