- టీఆర్ఎస్ కు భారత రాష్ట్ర సమితిగా నామకరణం
- మిన్నంటిన సంబురాలు
నమస్తే శేరిలింగంపల్లి: తెరాస పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వార్డ్ ఆఫీసు నుంచి గుల్మోహర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బాణాసంచాలు కాల్చారు. ఈ రోజు మధ్యాహ్నం 1:19 నిమిషాలకు పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెరాస సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అధికారంగా తెలంగాణ భవన్ లో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, రవీంద్ర రాథోడ్, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, శేరిలింగంపల్లి విలేజ్ బస్తి అధ్యక్షులు రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఘణపురం రవీందర్,వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, బసవరాజ్, కవిత, గోపాల్, కటిక రామచందర్, జమ్మయ్య, బసవయ్య, నయీమ్, జనార్ధన్, సాయి, దివ్య, ముంతాజ్ బేగం, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, విజయ్ కుమార్, జమ్మయ్య, విక్రమ్, జయ, రజిని, చంద్రకళ, భాగ్య, సౌజన్య, నజియా బేగం, శమ్ము, దివాకర్ రెడ్డి, మల్కయ్య, రాకేష్, వినయ హరీష్, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.