ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరో పది టాస్క్ ఫోర్స్ వాహనాలు

  • జెండా ఊపి ప్రారంభించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర విప్రో సర్కిల్ వద్ద జెండా ఊపి 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి ఈ టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్ట్ నెలలో ప్రారంభించిన 6 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా మరో 10 వాహనాలను నేడు ప్రారంభిస్తున్నాము. ఈ వెహికల్స్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో పనిచేస్తాయన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైకులలో ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు. వాటిలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, డి‌డి చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, గాగుల్స్, LED బాటన్ తదితర వస్తువులు ఉన్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఐటి కారిడార్, ఇండస్ట్రియల్ ఏరియాలలో వెహికల్ బ్రేక్ డౌన్ అయిన లేదా రోడ్డు పై పార్కింగ్ చేసిన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ వాహనాలు ఎల్లప్పుడూ రద్దీ ప్రాంతాలలో తిరుగుతూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చేస్తాయన్నారు. ఈ వాహనాలు విజిబుల్ గా ఉండటం వలన రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్డుపై పార్కింగ్, Jay walking , Push Carts రోడ్డు పై నిలిపి ఉంచడం వంటి ఉల్లంఘనలు తగ్గుతున్నాయని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కోసం మొత్తం 10 మోటార్ సైకిళ్లను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు. మొత్తం 20 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్ ఫోర్స్ లో పని చేస్తారన్నారు. వీరికి ఒక సీనియర్ ర్యాంక్ అధికారి ఇన్ చార్జ్ గా ఉంటారన్నారు. పీక్ అవర్స్ లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్ ఫోర్స్ టీం లు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. వీరు ముఖ్యంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (PAS) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తుంటారు.

ప్యాట్రోలింగ్ వివరాలు:

  • విస్పర్ వ్యాలీ నుండి గచ్చిబౌలి జంక్షన్ వయా .. ఖాజాగూడ, బయో డైవర్సిటి.
  • బయో డైవర్సిటి నుండి AIG హాస్పిటల్స్ వయా IKEA రోటరీ.
  • ఖాజాగూడ నుండి నానక్ రామ్ గూడ వయా DPS & Oakridge School.
  • IKEA రోటరీ నుండి NIA జంక్షన్ వయా సైబర్ టవర్స్ అండ్ 100 ft జంక్షన్.
  • నీరుస్ జంక్షన్ నుండి సైబర్ టవర్స్ వయా COD జంక్షన్. ( ముఖ్యమైన ఈవెంట్స్ జరిగే సమయాలలో మెటల్ చార్మినార్ నుండి హైటెక్స్)
  • కేబుల్ బ్రిడ్జి నుండి నెక్టర్ గార్డెన్ వయా ఇనార్బిట్ మాల్.
  • గచ్చిబౌలి – ఇందిరా నగర్ – IIITH జంక్షన్ – DLF – రాడిసన్ – గచ్చిబౌలి.
  • విప్రో సర్కిల్ నుండి నలువైపుల గౌలిదొడ్డి/ కాంటినెంటల్ జంక్షన్/ మైక్రోసాఫ్ట్ వరకు.
  • రాడిసన్ నుండి రాఘవేంద్ర కాలనీ వయా కొత్తగూడ.
  • అల్వీన్ క్రాస్ రోడ్ నుండి నిజాంపేట్ క్రాస్ రోడ్ వయా మియాపూర్ మెట్రో స్టేషన్.
  • JNTU నుండి ఫోరమ్ మాల్ సర్కిల్.
  • రెమెడీ హస్పటల్ యూ టర్న్ నుండి నిజాంపేట్ క్రాస్ రోడ్ వయా JNTU.
  • కూకట్పల్లి Y జంక్షన్ నుండి రెమెడీ యూ టర్న్ వయా సౌత్ ఇండియా షాపింగ్ మాల్.
  • సుచిత్ర నుండి కొంపల్లి వయా పేట్ బషీరాబాద్.
  • మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి మేడ్చల్ బస్ స్టాండ్.
  • శంషాబాద్ మార్కెట్ నుండి ప్యారడైజ్ హోటల్ వయా శంషాబాద్ బస్ స్టాండ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోమ్ తర్వాత ఇటీవల అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడంతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఫ్లో పెరిగిందన్నారు. దీంతో పాటు క్యాబ్ సర్వీసెస్, డెలివరీ బాయ్స్ మూవ్ మెంట్స్ కూడా పెరిగినదన్నారు. ట్రాఫిక్ సాఫీగా వెళ్లే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డి‌సి‌పి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, డి‌సి‌పి ట్రాఫిక్ టీ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డి‌సి‌పి శిల్పవల్లి, బాలానగర్ డి‌సి‌పి సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఏఆర్ ఏడీసీపీ హెడ్ క్వార్టర్స్ రియాజ్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, SCSC ఫోరమ్ సభ్యులు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పాల్గొన్నారు.

ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here