శేరిలింగంపల్లిలో గురువారం విద్యుత్ ఉండని ప్రాంతాలు

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల హుడా 11 కెవి ఫీడర్, ఎపిస్టోమ్ ఫీడర్ల మరమ్మత్తులు, విద్యుత్ తీగల వద్ద చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు తారనగర్ ఏఈ రవిచంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 :30 గం.ల నుండి మధ్యాహ్నం 12 :30 గం.ల వరకు ఫీడర్ పరిధిలోని తెల్లాపూర్ చౌరస్తా, నల్లగండ్ల వాటర్ ట్యాంక్, నల్లగండ్ల హుడా కాలనీ తదితర ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3 ;00 నుండి సాయంత్రం 5 :00 గం.ల వరకు తెల్లాడూర్ రోడ్, సాధన స్కూల్ వెనుక ప్రాంతం, ఎపిస్టోమ్ గ్లోబల్ స్కూల్, రాక్ పార్క్ సైడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here