కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలను చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జూబ్లీ ఎనక్లేవ్ వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను హమీద్ పటేల్, జీహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షించించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో కలిసి పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ ఇంజనీర్ రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ లతో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, జీహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.