ఎన్నో పరిశోధనలు, పరీక్షల అనంతరం కరోనా వైరస్ ను నివారించగలిగే వాక్సిన్ లను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. జనవరి 16 వ తేదీనుండి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాక్సిన్ పంపిణీ చేపడుతోంది. ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తయారు చేసిన కోవీషీల్డ్ వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాక్సిన్ లు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ అవసరాల కోసం ప్రాధాన్యత వర్గాలకు మాత్రమే వాక్సినేషన్ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే వాక్సిన్ వేసుకున్న పలువురు వ్యక్తులు అస్వస్థతకు గురైనట్లు, మృతి చెందినట్లు సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో పలు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా, భారత్ బయో టెక్ సంస్థలు వాక్సిన్ కు ఎవరెవరు దూరంగా ఉండాలనే విషయాలపై స్పష్టతనిచ్చాయి.
వాక్సిన్ కు వీరు దూరంగా ఉండాలి…
- ఆహరం, మందుల, వాక్సిన్ ల వల్ల అలర్జీలు కలిగి ఉన్నవారు
- జ్వరంతో ఉన్నవారు
- రక్తస్త్రావం సంబంధ వ్యాధులు కలిగి ఉన్నవారు
- వ్యాధి నిరోధక వ్యవస్థ సంబంధ వ్యాధులు కలిగి ఉన్నవారు
- వ్యాధి నిరోధక వ్యవస్థ సంబంధ మందులు ఉపయోగించేంచేవారు
- గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు
- గర్భం దాల్చాలని భావిస్తున్న స్త్రీలు
- ఇతర కోవిద్ వాక్సిన్ తీసుకున్న వారు
- ఇతర దీర్ఘకాలిక, తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్నవారు వాక్సినేషన్ కు దూరంగా ఉండాలని భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ సంస్థలు తెలిపాయి.