- పార్టీ అభివృద్ధికి కృషిచేసే వారికి తగిన గుర్తింపు ఖాయం: నంద కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత పార్టీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చింతకింది గోవర్ధన్ గౌడ్ కు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందకుమార్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్ట పడిన వారికి కొంత ఆలస్యమైనా తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన చింతకింది గోవర్ధన్ గౌడ్ కు పార్టీ అధినాయకత్వం జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం అందుకు నిదర్శనమని అన్నారు.
బీజేవైఎం నాయకుల సన్మానం…
బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రాగిరి సాయి రామ్ గౌడ్, శేరిలింగంపల్లి నాయకుడు సుహాస్ గౌడ్ లు చింతకింది గోవర్ధన్ గౌడ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.