గత వారం వాట్సాప్ తన సేవా నిబంధనలు, గోప్యతా విధానంలో మార్పులను ప్రకటించిన విషయం విదితమే. ఫిబ్రవరి 8లోగా వాటికి అంగీకారం తెలపాలని వినియోగదారులను కోరింది. అయితే ఆ విధానంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు మారుతున్న తరుణంలో వాట్సాప్ తన మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను పంచుకోబోమని స్పష్టం చేసింది.
కాగా ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించేందుకు ఇంతకు ముందు వాట్సాప్ ఫిబ్రవరి 8వ తేదీని గడువుగా ప్రకటించగా ఇప్పుడు దాన్ని మే15వ తేదీకి పొడిగించింది. అంటే ఆ లోపు యూజర్లు వాట్సాప్ ప్రైవసీ పాలసీకి అనుమతి తెలపాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున యూజర్లు వాట్సాప్ ను తొలగిస్తుండడంతో వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.