- ఎస్ విఎస్ ఆవాస గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఎన్నికల్లో..నార క్రిష్ణారెడ్డి ప్యానెల్ ఘనవిజయం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని ఎస్ విఎస్ ఆవాస గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఎన్నికల్లో నార క్రిష్ణారెడ్డి ప్యానెల్ ఘనవిజయం సాధించింది. ఎస్ విఎస్ ఆవాస ఫ్లాట్ ఓనర్స్ మెయింటనెన్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా నార క్రిష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా పవన్, జనరల్ సెక్రటరీగా శివ జగన్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా సంయుక్త, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంతోష్, స్పోర్ట్స్ సెక్రటరీగా వెంకట్, అడ్వైజర్ గా సోమనాథ కుమార్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ విఎస్ ఆవాస గేటెడ్ కమ్యూనిటీ వాసుల సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి నాలా రిటైనింగ్ వాల్ పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.





