నమస్తే శేరిలింగంపల్లి : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ “ఎం.డి.జమీర్” హర్షం వ్యక్తం చేశారు.

భారత న్యాయ వ్యవస్థ మైనారిటీల హక్కుల పరిరక్షణకు అండగా ఉందని, సుప్రీం తీర్పు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మైనారిటీల సముచితమైన జీవనానికి పటిష్ఠమైన నియమాలను రూపొందించినదని వివరించారు.





