ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు కృషి: బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • వేడుకగా ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ విగ్రహావిష్కరణ
  • ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ విగ్రహావిష్కరణ వేడుకగా నిర్వహిచారు. బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, విశ్వ హిందు పరిషత్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదిరెడ్డి, భజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ జీవన్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఛ‌త్ర‌ప‌తి శివాజీ మహరాజ్ చరిత్ర స్ఫూర్తిదాయకమని, పిల్లలకు తల్లులు బాల్యం నుండే శివాజీ మహరాజ్ ఆశయాలను బోధించాలని ఆయన స్పూర్తితో చెడు వ్యసనాలకు యువత బానిసలుగా మారకుండా ధర్మ రక్షణ కోసం పాటు పడాలని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు కంకణం కట్టుకున్నానని వెల్లడించారు. నియోజకవర్గం నియోజకవర్గంలోని శివాజీ విగ్రహం లేని ఏ గ్రామం నుండైన యువత విగ్రహ ఏర్పాటుకు ముందుకు వస్తే తన వంతు సాయంగా విగ్రహం అందిస్తానని తెలిపారు.

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, విశ్వ హిందు పరిషత్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదిరెడ్డి, భజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ జీవన్

అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన, యుద్ద నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శమ‌ని కొనియాడారు. ప్రజలే ప్రభువులుగా ఆయ‌న పాల‌న సాగింద‌న్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను ఒక భాగం అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు, పిల్లలు. స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here