శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు ఆ పార్టీ నాయకుడు మారబోయిన రవి యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అధిష్టానం తమకు టికెట్ కేటాయిస్తుందని ధీమాతో ఉన్నామని, అయినా పార్టీ తమను నిరాశకు గురిచేసిందని తెలిపారు. శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ రెబెల్ గా నామినేషన్ వేసి బరిలో నిలువనున్నట్లు ఆయన తెలిపారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన రవి యాదవ్ అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రవి యాదవ్ సోదరుడు మారబోయిన రాజు యాదవ్ డివిజన్ పార్టీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు.

Eeyananu serious ga edaina party teeskovali antey janala madyalo ravali .. elections mundu mari pandagala posters loney kanipiste saripodu