ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా.. ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటాం : బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

  • గచ్చిబౌలి గ్రామంలో శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్
  • భారతీయ జనతా పార్టీలో పలువురు చేరిక
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవికుమార్ యాదవ్
  • శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
  • పాల్గొన్న నాయకులూ, కార్యకర్తలు, ప్రజలు
శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి డివిజన్, గచ్చిబౌలి గ్రామంలోని బూత్ నంబర్ : 372, 374, 376, 378, 379, 388లకు సంబంధించిన శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ గచ్చిబౌలి గ్రామం, స్ట్రీట్ నంబర్: 2లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అయితే గచ్చిబౌలి గ్రామానికి చెందిన మఖన్ సింగ్ వారి సన్నిహితులు 50 మంది పార్టీలో చేరగా.. వారికి రవికుమార్ యాదవ్, బీజేపీ నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గచ్చిబౌలి గ్రామంలో భిక్షపతి యాదవ్ హయంలోనే రోడ్లు, డ్రైనేజీ లైన్లు, మంజీరా వాటర్ పైప్ లైన్లు, నాలా పనులు చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే చేసిందేమీలేదని, వర్షం వస్తే రోడ్లన్ని జలమయం అవుతున్నాయని, అధికారులైన పట్టించుకుని ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. కేసిఆర్ ఎన్నికల్లో గెలవటానికి ముందు నిరుద్యోగ భృతి, కేజీ టు పిజి ఉచిత విద్య, జిల్లా కో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ , బీసీ.ఎస్.సి, గిరిజనులకు రిజర్వేషన్లు వీటిలో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

పాల్గొన్న నాయకులూ, కార్యకర్తలు, ప్రజలు

బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి, భారత దేశాన్ని శక్తివంతమైన దేశం తీర్చిదిద్దుతున్నది కేవలం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటేస్టడ్ కార్పొరేటర్ ఏళ్లేష్, డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, అనిల్ కుమార్ యాదవ్, రమేష్, జై హింద్, భరత్, యాదయ్య, లింగం, మధు, బాలరాజ్ , కాంచన కృష్ణ, స్థానిక కాలనీ వాసులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here