విద్యార్థులకు యూనిఫామ్స్ , పుస్తకాలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆకాక్షించారు.

వెంకటేశ్వర నగర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను అందచేసి మాట్లాడారు. విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నామని. 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వర్క్‌షీట్‌లు, పుస్తకాలు, 6వ తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తి చేశామన్నారు. తరగతి గదులను అలంకరించి, ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, తన వంతు కృషి, సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు,హరినాథ్, లక్ష్మీ నరసయ్య, సత్యనారాయణ, శ్యామ్ రావు, చంద్రమోహన్, దుర్గ, సురేష్,ఎర్ర లక్ష్మయ్య,శివ సాగర్, రాచాల శీను, సోములు, రావు, కేబుల్ రమేష్, పంతులు, భాస్కర్, రాజు మల్లన్న, యాదగిరి, శంకర్ గౌడ్, నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here