గుల్ మోహర్ పార్క్ కాలనీ లో సమస్యలు పరిష్కరించండి

  • ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీని కలిసి వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు
    సానుకూలంగా స్పందించిన గాంధీ
  • సమస్యల పరిష్కారానికి కాలనీలో పర్యటిస్తానని హామీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీలో నెలకొన్న సమస్యలతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించాలని కోరుతూ కాలనీవాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. కాలనీలో 20 ఏండ్ల కిందట వేసిన మంచి నీటి పైప్ లైన్ల స్థానంలో కొత్తవి వేయాలని, ప్లాట్ నంబర్ 440D నుండి 451 A వరకు.. 554 నుండి 557 A వరకు రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని గాంధీని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గుల్ మోహర్ పార్క్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యల పరిష్కారానికి కాలనీ లో పర్యటిస్తానని పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యను పరిష్కరిస్తానని, మంచి నీటి పైప్ లైన్ పునరుద్దరణ పనులు త్వరలోనే చేపడుతామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుల్ మోహర్ పార్క్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం , జాయింట్ సెక్రటరీ ఆనంద్ కుమార్, జాయింట్ సెక్రటరీ పెంటోజి, మెంబర్ శేఖర్ రావు, తెరాస నాయకులు MD ఇబ్రహీం పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీని కలిసి వినతి పత్రం అందజేస్తున్న గుల్ మోహర్ పార్క్ కాలనీకాలనీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here