- సర్వత్రా హర్షం
- ప్రభుత్వ విప్ గాంధీని కలిసి కృతజ్ఞతలు
- సీఎం కెసిఆర్ , మంత్రి కేటీఆర్లకు రుణపడి ఉంటామన్న లభ్దిదారులు
నమస్తే శేరిలింగంపల్లి : ఆసరా పెన్షన్ డబ్బులు తమ ఖాతాలో జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆసరా లభ్డిదారులు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పించన్ల పథకం చాలా గొప్పదని, ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు పొందిన వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం , అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, కుల, మత, ప్రాంత, పార్టీ ల భేదం లేకుండా అర్హులైన అందరికీ ఆసరా ఫించన్లు అందిస్తున్న గొప్ప మానవతావాది సీఎం కెసిఆర్ అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఆసరా ఫించన్ల ను అందిస్తామని వెల్లడించారు. తమ మీద దయ చూపి ఈ నెల డబ్బులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని, పండుగ వాతావరణంలో పింఛన్లు ఇవ్వడం మనసుకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆసరా పించన్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ కి , మంత్రి కేటీఆర్ కు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి సర్కిల్ మహిళ సమాఖ్య ప్రెసిడెంట్ మంజుల తెరాస నాయకులు మధు, లాలు నాయక్ పాల్గొన్నారు.