నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆ కాలనీలో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, మంచినీటి సరఫరా పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. వెంటనే తగు చర్యలు తీసుకుని ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక కాలనీ నుంచి మరొక కాలనీకి మధ్య ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సాయి ఐశ్వర్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసిషన్ కమిటీ సభ్యులు, ప్రభాకర్, అమిత్ భరద్వాజ్, భాగ్య లక్ష్మి, నర్సింహామూర్తి, అశోక్ రాజు, రమణి రామ చంద్ర రావు, విజయ కుమార్, రమణి, సాయి ఐశ్వర్య కాలనీవాసులు రామ్ చందర్ రావు, చిట్టి బాబు, మహేష్, ఈశ్వర్, శ్రీధర్, విజయ్, సతీష్ చంద్ర మురళి, అతుల్, మనీష్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి సీనియర్ నాయకులు, సుధాకర్ రాజేష్, అరుణ్ కృష్ణ బన్నీ, కిశోరె ఈశ్వరయ్య, సతీష్ నర్సింగ్ నాయక్, స్థానిక నేతలు, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.