భార‌త్‌లో రూ.125 నాణెం..విడుద‌ల చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రూ.125 నాణెం ఏమిటి..? నిజ‌మేనా అని అనుమాన‌ప‌డ‌కండి. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ నాణేన్ని బుధ‌వారం విడ‌ద‌ల చేశారు. ఇస్కాన్ సంస్థ‌ వ్య‌వ‌స్థాప‌కులు శ్రీ‌ల ప్ర‌భుపాద 125వ జయంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న స్మార‌కార్ధం రూ.125 నాణేన్ని విడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విడుద‌ల చేశారు. ఇస్కాన్ సంస్థ హ‌రేకృష్ణ ఉద్య‌మం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా స‌నాత‌న ధ‌ర్మ విశిష్ట‌త‌ను ప్ర‌చారం చేస్తోంది. దీంతో పాటు శ్రీ‌మ‌ద్ భ‌గ‌వ‌ద్గీత‌, వైదిక గ్రంథాల‌ను 89 భాష‌ల‌లో త‌ర్జుమా చేసి ప్ర‌పంచ దేశాల‌కు భార‌త జ్ఞానాన్ని అంద‌జేస్తోంది. అక్ష‌య పాత్ర కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజనం, రూ.5కే భోజ‌నం అంద‌జేస్తూ ఎంద‌రో పేద‌ల ఆక‌లి తీర్చుతోంది. ఇస్కాన్ సంస్థ‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది స‌భ్యులు స్వ‌చ్ఛందంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here