- 87వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కమలం పువ్వు వికసించి, గడ్డపై కాషాయ జెండా ఎగిరే వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.
గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా రాజేందర్ రెడ్డి నగర్, సత్య ఎంక్లేవ్, శుభోదయ కాలనీ, సురక్ష హిల్స్, కాలనీలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్, బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, సింధు రెడ్డి, రామ్ రెడ్డి తో పాదయాత్ర నిర్వహించారు. విద్యావంతులు, మేధావులు సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు ఒక్కసారి ఆలోచించి మోసపూరిత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు విరుద్ధంగా ఓటు వేసి రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న బిజెపి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు గౌడ్, నరసింహారెడ్డి, మన్నె దత్తు, రఘునాథ్ రెడ్డి, వెంకట బాలపతి, సైఫుల్ల ఖాన్, శ్రీనివాస్, రాకేష్ దూబే పాల్గొన్నారు.