బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్

  • పాదయాత్రకి విచ్చేసిన రవికుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికిన హఫీజ్
    పేట్ డివిజన్ బిజెపి శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడానికి ప్రణాళికలు పన్నుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ప్రజలను కోరారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే అసమర్ధ పాలనను, ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలుపుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గడపగడపకు బిజెపి నిదానంతో హాఫిజ్ పేట్ గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చేపట్టిన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర 73 వ రోజుకు చేరుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ అమలుకాని హామీలు ఎన్నో ఇస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని, వారి మాటలు ఎవరు నమ్మకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చే నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ జనరల్ సెక్రటరీస్, ఓబీసీ మోర్చా, యువ మోర్చా , మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here